ఏఐటియుసి నల్లగొండ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాల్గవ సారి పల్లా దేవేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక*
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.
నల్లగొండ జిల్లా పదవ మహాసభలు ఆదివారము నాడు కొండమల్లేపల్లిలోని వివిఆర్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. జిల్లాలోని కార్మికులు ఎదురకొంటున్న పలు సమస్యలపై చర్చించి భవిషత్ పోరాట కార్యక్రమాన్ని రూపొందించి పలు తీర్మానాల్ని ఆమోదించడం జరిగింది. అనంతరం మహాసభలో జిల్లా నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగిందని ఏఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి తెలిపారు.
 జిల్లా అధ్యక్షులుగా నూనె రామస్వామి, ఉపాధ్యక్షులుగా, కె ఎస్ రెడ్డి, ఎండి సయీద్, పానేం వెంకట్రావు, దోటి వెంకన్న,
ప్రధాన కార్యదర్శిగా పల్లా దేవేందర్ రెడ్డి
సహాయ కార్యదర్శిలుగా నూనె వెంకటేశ్వర్లు, యడమ సుమతమ్మ ,బరిగల వెంకటేష్
కోశాధికారిగా దోనకొండ వెంకటేశ్వర్లు, మరియు 39 మంది జిల్లా కౌన్సిల్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.తీర్మానాలు..హమాలి కార్మికులకు సమగ్ర చట్టం రూపొందించి బీమా సౌకర్యం, పెన్షన్ సౌకర్యం కల్పించాలి.అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, పని భారం తగ్గించాలి.గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి.భవనిర్మాణ కార్మికులకు 50 సంవత్సరాలు దాటిన వారికి నెలకు 5000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి.మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాల పెంచాలి.లారీ, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి.హాస్పిటల్ వర్కర్స్ కనీస వేతనం 24000 ఇవ్వాలి.ఆర్టీసీ కార్మికుల యూనియన్ గుర్తించి వెంటనే ఎన్నికల నిర్వహించాలి
మిషన్ భగీరథ కార్మికుల వేతనాలు పెంచాలి. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, కనీస వేతన చట్టాలు అమలుచేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్మానం చేశారు.