ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా పదవ మహాసభను జయప్రదం చేయండి పల్లా దేవేందర్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి

మండల కేంద్రంలోని శుక్రవారం నాడు జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఏఐటియుసి నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ  ఏఐటీయూసీ నల్లగొండ జిల్లా పదవ మహాసభను జయప్రదం చేయాలని ఈ సభ తేదీ 13.11.2022 ఆదివారం నాడు ఉదయం 10 గంటల నుండి  వివిఆర్ ఫంక్షన్ హాల్  కొండపల్లిలో సమావేశాలు ఉంటాయని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ ఐ టి యు సి  నాయకత్వంలో అనేక పోరాటాలు త్యాగాలు చేసి సాధించుకున్న ముఖ్యమైన 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి  వచ్చిన తర్వాత నాలుగు కోడ్లుగా కుదించి కార్పొరేట్ సంస్థలకు గుత్త పెట్టుబడిదారులకు అనుకూలంగా కార్మికులకు నష్టం కలిగించే విధంగా మార్పు చేస్తుంది జీఎస్టీ పెద్ద నోట్లు రద్దు వంటి చర్యల వల్ల లక్షలాది చిన్న పరిశ్రమలు మూతపడి లక్షల సంఖ్యలో కార్మికులు ఉపాధిని కోల్పోయారు అన్ని సంఘాలను ఐక్యపరిచి కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై ఏఐటీయూసీ పెద్ద ఎత్తున పోరాటాలను నిర్వహిస్తుంది నిత్యవసరాల వస్తువుల ధరలు ఆకాశాన్ని అందుతున్న కార్మికుల వేతనాలు పెరగటం లేదు కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల భారతదేశ ఆర్థిక మాంద్యంలో  కొట్టుమిట్టాడుతుంది పేద మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలను కాపాడడంలో విఫలం చెందుతుంది తెలంగాణ ఏర్పడితే రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థే ఉండదని చెప్పిన ప్రభుత్వం కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులను కొనసాగిస్తూ వారిని రెగ్యులర్ చేయకపోవడం వారికి కనీస వేతనాలు కూడా ఇవ్వని దుస్థితి కొనసాగుతోంది కార్మికుల హక్కులు వాటి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం ఏఐటీయూసీ  నిరంతరం రాజులేని పోరాటాలు చేస్తున్నది వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని కనీస వేతన చట్టాలను సవరించాలని కార్మిక శ్రమ దోపిడీని అరికట్టాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని స్కీమ్ వర్కర్ల వేతనాలు పెంచాలని అసంఘటిత రంగ కార్మికుల సమగ్ర చట్టం రూపొందించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తున్నది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నలపరాజు సతీష్ కుమార్, సిపిఐ మండల కార్యదర్శి వెంకట్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి రామస్వామి, మండల సహాయ కార్యదర్శి శేఖరాచారి, అలమోని  మల్లయ్య, సోమ్లా, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు