*ఏఐసీసీ పిలుపుమేరకు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి

ఆదేశాలకై కాంగ్రెస్ పార్టీ తరపున రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు రాజీవ్ రెడ్డి.

ధర్నా కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి

గద్వాల అర్ సి (జనం సాక్షి) ఆగస్ట్ 5,
జోగులాంబ గద్వాల్ జిల్లాలోని
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసన తెలుపుతూ ఈ కార్య క్రమంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యవసరా ధరలు జీఎస్టీ పెంపునకు దేశంలో తీవ్రమైన ఆర్థిక అభివృద్ధిని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిత్య అవసరాలపై ధరలను పెంచుకుంటూ పోతూ సామాన్యునికి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో గురిచేస్తూ , ప్రజలను అటు నిరుద్యోగులను ఇటు వైద్య విధానాన్ని నాశనం చేస్తున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బుద్ధి చెప్పే సమయం దగ్గర ఉందని సూచించారు.ప్రజలు ప్రధాని మోడీని నమ్మి మోసపోయారని మొదటి దశ నుంచి దేశ ప్రజల ను నాశనం చేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో దేశ సంపదను కాపాడుకుంటూ వస్తే మోడీ మాత్రం దేశ సంపదను పెట్టుబడిదారులకు దానదత్యం
చేస్తూ అప్పుల ఊబిలోకి సామాన్య ప్రజలను నెట్టుతున్నారనీ అన్నారు.
రాష్ట్ర ప్రాజెక్టుల పేరుతో ఇటు కేసీఆర్ పాలన ప్రజలను మభ్యపెట్టి వ్యవహరిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ , అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ధరలు పెంచుకుంటూ పోతున్నారు అందువల్ల ప్రజలు చాలా ఇబ్బంది గురవుతున్నారు. నిత్యవసర ధరలు పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ కరెంట్ చార్జీలు ఆర్టీసీ బస్టాండ్ ఇలా ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సరైన సమయంలో ప్రజలు గుణపాఠం చెబుతారని ఆ సమయం కూడా చాలా తొందరలోనే వస్తుందని చెప్పారు. గత 8 సంవత్సరాల పరిపాలనను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యం ప్రజల మీద భారాలు వేస్తూ ఇది కాకుండా ప్రభుత్వ ఆస్తుల అనుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారు. గద్వాల అభివృద్ధి చేసిన పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.టీఆర్ఎస్ బిజెపి వట్టి మాటలు చెప్పుకుంటూ పోతే ప్రజలలోభయాలు సృష్టించి ప్రజలను మభ్యపెట్టి గెలవడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు మిమ్మల్ని గుర్తించారు ఈసారి గద్వాల్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమని సభాముఖంగా తెలియజేశారు.ఈ కార్య క్రమంలో మాజీ జెడ్పిటిసి, మాజీ ఎంపీపీ, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉమాదేవి గారు,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్,గద్వాల్ టౌన్ అధ్యక్షులు ఇసాక్ రాష్ట్ర ఓపిసి సెల్ కార్యదర్శి,మండల అధ్యక్షులు పార్టీ సేవాదళ అధ్యక్షులు జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్,ఎన్ఎస్ యు ఐ అధ్యక్షులు జిల్లా యువ జనకాంగ్రెస్ అధ్యక్షులు పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.