ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర

రఝునాధపాలెం :22 అక్టోబర్(జనం సాక్షి): ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని మక్తల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి ఖమ్మం నగర కమిటీ అధ్యక్షుడు, పీసీసీ మెంబర్ ఎండీ.జావిద్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీకి స్వాగతం పలికేందుకు భారీగా జనం తరలివెళ్లారు. సుమారు 500 మంది కార్యకర్తలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో రాహుల్ గాంధీ పాదయాత్రకు స్వాగతం పలికేందుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యమాన్ని ఎండీ.జావిద్ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు.