ఏఐసీసీ సెక్రటరీ శ్రీధర్ బాబు ను సన్మానించిన బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షుడు తిరుపతి యాదవ్
c. జనంసాక్షి : అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ కార్యదర్శితో పాటుగా కర్ణాటక రాష్ట్ర ఇంఛార్జిగా నియమితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి, మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ను మంగళవారం కలిసిన మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ పూలమాల వేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మరింత ఉన్నత పదవులను తమ నాయకుడు శ్రీధర్ బాబు అధిరోహించాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి యాదవ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామగిరి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు కండే పోచం, నాగేపల్లి మాజీ సర్పంచ్ బాబూరావు, గొల్లపల్లి సర్పంచ్ శిలారపు మల్లయ్యలు పాల్గొన్నారు.