ఏకగవాక్షంగా టిఎస్‌ ఐపాస్‌

పరిశ్రమల ఏర్పాటులో సత్వర నిర్ణయాలు
పారిశ్రామికంగా మంచి ఫలితాలు

హైదరాబాద్‌,జూలై29(జనంసాక్షి ): టీఎస్‌ఐపాస్‌ దేశవ్యాప్తంగా మన్ననలు అందుకుంటోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా టీఎస్‌ ఐపాస్‌ అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ మంచి ఫలితాలు సాధిస్తోంది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నారు. టీఎస్‌ఐపాస్‌ ద్వారా రెండేళ్లలో 4వేలకు పైగా పరిశ్రమలకు అనుమతులిచ్చామని గతంలో మంత్రి కెటిఆర్‌ పేర్కొన్నారు. కాలుష్య రహిత పరిశ్రమలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడిరచారు. అలాగే సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తిని కూడా చేపడుతు న్నామని అన్నారు. సెజ్‌లలో ప్రత్యేక రాయితీలు కల్పిస్తున్నారు. దీంతో పెట్టుబడి దారులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదు. త్వరలోనే సంగారెడ్డిలో ఎల్‌ఈడీ బల్బుల తయారి పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడిరచారు. తెలంగాణలో వనరులకు కొదవ లేదు. ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. వరంగల్‌లో కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ను ప్రారంభించారు. అన్ని రంగాల్లో తెలంగాణను అగ్రపథాన నిలిపేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు. అంతే కాకుండా ఉన్న పరిశ్రమలకు అదనంగా విస్తరించుకోవడానికి రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. ఇందులో భాగంగా దేశంలో తొలి సారిగా ఇంటర్నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆటోమోటివ్‌ టెక్నాలజీ ధృవీకరణ పొందిన ఉత్పాదనతో ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసింది. గుమ్మడిదల మండలం అన్నారం పారిశ్రామికవాడ లోని సోలార్‌ ప్రీమియర్‌ మాడ్యుల్‌ పరిశ్రమ రాయితీలను సద్వినియోగం చేసుకోవడానికి అదనంగా మరో సోలార్‌
యూనిట్‌ను విస్తరించింది. పెట్టుబడులు పెట్టి ఉన్న పరిశ్రమను అదనంగా విస్తరించింది. దీంతో అదనంగా 200 మెగావాట్ల విద్యుత్‌ తయారుచేయనుంది. అంతే కాకుండా సోలార్‌తో నడిచే ఎలక్ట్రిక్‌ వాహనాలను తయారు చేసి విడుదల చేశారు. అవసరమైన నైపుణ్య శిక్షణ ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుంది. టాస్క్‌ ద్వారా శిక్షణకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇస్తుందని కెటిఆర్‌ తెలిపారు. సోలార్‌ ఉత్పత్తి పెరిగితే పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలకు స్వస్తి పలకనుంది. ఈ `వాహనాలు వస్తే వాయు కాలుష్యం తగ్గి పర్యావరణంను రక్షించే విధంగా మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటగా సోలార్‌ పరిశ్రమ అదనంగా 375 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ను తయారు చేయనుంది. సోలార్‌ పరిశ్రమలను స్థాపించే వారికి టీఎస్‌ ఐపాస్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందించే రాయితీలను విస్తరిస్తామని కూడా ప్రకటించారు. సంగారెడ్డి పరిశ్రమ వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే ఐదేండ్ల కాలంలో ఈయూనిట్‌ సామార్ధ్యాన్ని వెయ్యి మెగావాట్ల పెంచనున్నారు. దీంతో రాష్ట్రంలో నీటి విద్యుత్‌కు తోడుగా సోలార్‌ విద్యుత్‌ రానుంది. ఇందు కోసం రూ. 12 వందల కోట్ల పెట్టుబడితో ప్రత్యేక యూనిట్‌ను ఏర్పాటు కానుంది. ఇలాంటి పరిశ్రమను రాష్ట్ర సర్కారు ప్రొత్సహించడం తో పరిశ్రమ అదనంగా విస్తరించారు. స్వరాష్ట్రంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా పరిశ్రమలో సోలార్‌ వాహనాలు, అదనంగా సోలార్‌ విద్యుత్‌ను తయారు చేయనున్నారు. దీని వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా మండలంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

తాజావార్తలు