ఏజెన్సీ గ్రామాలలో పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రు నాయక్
గంగారం సెప్టెంబర్ 29 (జనం సాక్షి)
గంగారం మండలం పునుగొండ్ల గ్రామంలోని రైతులు పండించే పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి చత్రునాయక్ రైతులతో రైతు వేదికలో జరిగిన సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు ఏ పంటలు వేశారని అడగడం జరిగింది. ఇక్కడి రైతులు ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారని దానిపై వచ్చే ఆదాయం కంటే పత్తి పంటను ఎక్కువ మొత్తంలో సాగు చేయాలని దానిలో కలుపు తీయడానికి బదులు గడ్డి ఇతర ఆకుజాతులను నాశనం చేయడానికి మార్కెట్లోకి వివిధ రకాలైన మందులు వచ్చాయని దీని వలన రైతులకు ఎక్కువ ఆదాయం వస్తుందని వివరించారు. మరీ ముఖ్యంగా రైతులు పంటలలో వాడే ఎరువుల వాడకం తగ్గించాలని సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. రైతులు యాసంగి సీజన్లో వేసే పంటల్లో ముఖ్యంగా వేరుశెనగ, పొద్దుతిరుగుడు పంటలను వేయడం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వస్తాయని సూచించారు. రైతులు వర్షాకాలంలో ముందుగా జీలుగుల పంటను దిక్కిలో దున్నడం ద్వారా వేసే పంటలకు అధిక పోషకాలు అందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో ఉదయ్, ఏఈఓ కిషోర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.