ఏజెన్సీ ప్రాంతంలో అభివృద్ధికి ఫారెస్ట్ అధికారులు సహకరించాలి

ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 19(జనం సాక్షి) :-
సోమవారం ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో ములుగు ఎమ్మెల్యే సీతక్క  మాట్లాడుతూ నియోజక వర్గం లో నక్సల్స్ ప్రభావిత (LW) ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పలు గ్రామాల అభివృద్ధికి రోడ్లు మంజూరు కావడం జరిగింది అని  ములుగు నియోజక వర్గం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతానికి రోడ్ల రవాణా సౌకర్యం లేక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ములుగు ఎమ్మెల్యే సీతక్క రోడ్లు మంజూరు కావడం జరిగింది అనీ ఫారెస్ట్ అధికారులు దయ చేసి ములుగు ప్రాంతాల లో అభివృద్ధికి అడ్డు తగల కుండా రోడ్లు వేసుకునుటకు త్వరిత గతిన అనుమతులు ఇవ్వాలనీ గతం లో అనేక ప్రాంతాలకు రోడ్లు మంజూరు అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు అడ్డు తగలటం మూలాన అనేక రోడ్లు మధ్యలోనే ఆగిన పరిస్థితి కావున ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ఫారెస్ట్ అధికారులకు  విజ్ఞప్తి చేశారు జిల్లా కలెక్టర్ యుద్ద ప్రాతిపదికన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించే విధంగా చోరువ చూపాలని పైన తెలుపబడిన మండలాల కే కాకుండా ఐటిడిఏ పంచాయితీ రాజ్ శాఖ, ఆర్ &బి ద్వారా ఇంక కొన్ని రోడ్లకు ప్రపోజల్స్ పంపడం జరిగింది అని త్వరలోనే మంజూరు కావడం జరుగుతుంది ఇంకా  కొన్ని మండలాల లో అభివృద్ధి  పనులకు శ్రీకారం చుట్టబోతున్నం   నా శక్తి వంచన లేకుండా ములుగు ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తానని సీతక్క అన్నారు రోడ్లు మంజూరు వివరాలు
మంగపేట మండలం
1,తిమ్మ పూర్ నుండి ముసలమ్మ గుట్ట గూడెం వరకు
2,తిమ్మాపూర్ నుండి రాళ్ల గుంపు
3, సంగం పల్లి నుండి పిఆర్ రోడ్డు వయ పాత చీపురు దుబ్బ
4,కమల పూర్ నుండి రెగుల గూడెం వరకు
5,కోమటి పల్లి రోడ్డు నుండి శాంతి నగర్ వరకు
6,కోమటి పల్లి రోడ్డు నుండి పోచమ్మ గూడెం వరకు
7,దోమెడ గ్రామము నుండి పాలయి గూడెం వరకు
8,రాజు పేట రోడ్డు నుండి కొత్త చీపురు దుబ్బ
9,కొత్త పేట జంగాల కాలనీ నుండి తిమ్మమ్ పేట
10,నీలాద్రి పేట నుండి ప్రాజెక్ట్ నగర్  గూడెం వరకు
11,నర్సింహ సాగర్ నుండి గోంది గూడెం వరకు
12,మణుగూరు ఏటూరు నాగారం రోడ్డు నుండి నడిమి గూడెం వరకు
13, తిమ్మమ్ పేట బీసీ కాలనీ నుండి చేరుపల్లి తిమ్మమ్ పేట రోడ్డు వరకు
ఏటూరు నాగారం మండలం
1, ఆర్ &బి రోడ్డు నుండి కంతాన పెల్లి గ్రామం  వరకు
2,జాతీయ రహదారి 163 రోయ్యురు వయ మిషన్ భగీరథ ట్యాంక్
3,జాతీయ రహదారి 163 రోడ్డు టూ ఆర్ &బి రోడ్డు వయ శంకరాజు పల్లి
4,పెద్ద వేంకటా పురం నుండి రాయబందం వరకు
5,గోగు పెల్లి నుండి లింగా పూర్ గ్రామం వరకు
6,అల్లం వారి ఘనపురం నుండి విరా పూర్ తోగు   వరకు
7,నాగులమ్మ గుడి నుండి చెల్పక రోడ్డు గుర్రాల బావి
8,బానాజి బంధం నుండి పుల కొమ్మ గొత్తి కోయ గూడెం వరకు
9, ఆర్ &బి రోడ్డు నుండి ఎలిషెట్టి పల్లి
10, జిడి వాగు నుండి గోగు పెల్లి వరకు
కన్నాయి గూడెం మండలం
1,గంగారాం నుండి గుట్ట గోరు రోడ్డు
*గోవిందా రావు పేట మండలం*
1,PWD రోడ్డు నుండి మోట్ల గూడెం వరకు
తాడ్వాయి మండలం
1,పోచాపూర్ నుండి నర్సాపూర్ గ్రామం వరకు
2, కమారం x రోడ్డు నుండి కామారం గ్రామం వరకు
3, ఆర్ &బి రోడ్డు నుండి కౌశెట్టి వాయి గ్రామం వరకు
4, లావ్వల x రోడ్డు నుండి లవ్వాల గ్రామం వరకు
5, ఆర్ &బి రోడ్డు నుండి ఆశన్న గూడెం ఎల్లా పూర్ గ్రామం వరకు
6,పోచా పూర్ గ్రామం నుండి బొల్లే పల్లి వరకు
7,కోడిషల నుండి నర్సాపూర్ వరకు రోడ్లు మంజూరు కావడం జరిగింది అని సీతక్క అన్నారు.
Attachments area