ఏడవ వేతన కమిషన్‌ కోరుతూ నిరసన

న్యూఢిల్లీ,మే8(జ‌నం సాక్షి):  ఏడవ వేతన కమిషన్‌ను అమలు చేయకపోవడం, రైల్వేలో ప్రైవేటీకరణను నిరసిస్తూ మంగళవారం నుండి 72 గంటల పాటు రైల్వే ఉద్యోగుల యూనియన్‌ దేశవ్యాప్తంగా నిరాహార దీక్షకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆల్‌ ఇండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఎఐఆర్‌ఎఫ్‌) ఒక ప్రకటనను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వంతో ఎఐఆర్‌ఎఫ్‌ అనేకసార్లు సమావేశమైందని, అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఎఐఆర్‌ఎఫ్‌తో అనుసంధానమైన అన్ని బ్రాంచీల్లోనూ ఈనెల 8 నుంచి మూడు రోజుల పాటు నిరాహార దీక్షలుంటాయని పేర్కొంది. ఈనెల 13-14 తేదీల్లో ఎఐఆర్‌ఎఫ్‌, జనరల్‌ కౌన్సిల్‌, వర్కింగ్‌ కమిటీతో సమావేశం నిర్వహించి, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపింది.