ఏడుకు చేరిన మృతుల సంఖ్య

వికారాబాద్‌ గ్రామీణం: రాజీవ్‌ గృహకల్ప పేలుడు ఘటనలో మృతుల సంఖ్య ఏడుకు చేరుకుంది. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఏసు(32) ఈరోజు మరణించాడు. ఇప్పటికే ఈయన కొడుకులు కార్తీక్‌ (4), సాయిచరణ్‌ (9)లు మరణించారు. ఈయన భార్య చికిత్స పొందుతోంది. నిన్న అమీనా, తస్లిమాలు చనిపోయిన సంగతి తెలిసిందే.