ఏపిపిఎస్ గ్రూప్-2 పరీక్షలను తనిఖీ చేసిన కలెక్టర్
కడప, జూలై 22 : స్థానిక నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, విద్యాసాధన డిగ్రీ కాలేజిలో జరుగుచున్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-2 పరీక్షలను జిల్లా కలెక్టర్ అనిల్‌కుమార్ ఆదివారం ఉదయం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ సూపరింటెండ్లతో ఆయన మాట్లాడుతూ, ప్రతి అభ్యర్థి తప్పక నలుపు, నీలి రంగు బాల్ పెన్‌తోనే జవాబులను మార్క్ చేయాలని, ఒఎంఆర్ షీట్ అప్పగించాలని ఆయన సూచించారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేరీ జోస్సిన్ తదితరులు పాల్గొన్నారు.