ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం
హైదరాబాద్, జనంసాక్షి: ఏపీపీఎస్సీ జారీ చేసిన వివిధ నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ఐదుగురు సభ్యుల ముఠా 125 మంది అభ్యర్థులను మోసం చేసింది. 125 మంది అభ్యర్థుల నుంచి రూ.2 కోట్లకు పైగా వసూలు చేశారు. బాధితులు పోలీసులను ఆశ్రయించగా ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు.