ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు: సీఎం చంద్రబాబు

ముంబై,మార్చి2(జ‌నంసాక్షి): ఆంధప్రదేశ్‌ని అగ్రగామిగా నిలిపేందుకు 7 మిషన్లు, 5 గ్రిడ్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీని మారుస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఆప్టికల్‌ ఫైబర్‌ అనుసంధానం చేస్తామన్నారు. ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ముంబైలోని ¬టల్‌ ట్రైడెంట్‌లో జరుగుతున్న ఇండియా ఇన్వెస్టర్స్‌ సదస్సులో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా పారిశ్రామిక వేత్తలను ఆకర్షించే ప్రయత్నం చేసారు. ఇక్కడ అన్నీ అనుకూల వాతావరణం ఉందన్నారు. సదస్సు అనంతరం సీఐటీఐ, హెచ్‌ఎస్‌బీసీ, మహింద్రా, స్టాన్‌ఫర్ట్‌ వర్సీటీ, అల్యూమినా ప్రతినిధులతో బాబు సమావేశం కానున్నారు. ఈ సదస్సులో సీఎం ఏపీలో పెట్టుబడులపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 2050 నాటికి ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఏపీ ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఏపీని ప్రపంచంలోనే అగ్రగామిగా మార్చేందుకు 7మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు ప్రారంభించామని ముఖ్యమంత్రి తెలిపారు. పెట్రో, కెమికల్‌, అగ్రో, ఫిషరీస్‌, డెయిరీ, మెరైన్‌ ప్రొడక్ట్స్‌, మినరల్స్‌ అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిసారించామని చంద్రబాబు తెలిపారు.ఆంధప్రదేశ్‌లో శాంతి భద్రతల సమస్య లేదని ముఖ్యమంత్రి  అన్నారు. సిటీ బ్యాంకు పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు.