ఏరులై పారుతున్న మద్యం! *అదనపు రేట్లకు మద్యం విక్రయాలు”
* గ్రామ గ్రామాన వెల్లివిరుస్తున్న బెల్ట్ షాపులు పట్టని ఎక్సైజ్ అధికారులు ; *** ప్రభుత్వం, ఎక్సైజ్, పోలీస్ అధికారుల అండదండలతోనే బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నా యి: భూపాల పల్లి ప్రతినిధి అక్టోబర్ 7 జనం సాక్షి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మండలాలలో ఏరులై పారుతున్న మద్యం వ్యాపారం పట్టని ఎక్సైజ్ పోలీస్ అధికారులు, ఎమ్మార్పీ రేట్లపై ఒక్కో క్వార్టర్ పై 20 రూపాయలు ఒక్కో బీరుపై ఎమ్మార్పీ రేటు కంటే 10రూపాయలు, అదనపుర్రేట్లతో అమ్మకాలు, మద్యం షాపుల నుండి బెల్ట్ షాపులకు నేరుగా ఆటోలలో బెల్ట్ షాపుల వద్దకు వెళ్లి విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇట్టి విషయంపై సంబంధిత ఎక్సైజ్ అధికారులను వివరణ కోరగా అదనపు రేట్ల విషయము, వైన్ షాప్ ల నుండి బెల్ట్ షాప్ ల వద్దకు ఆటోలో తరలిస్తున్న విషయం ఇప్పటివరకు మా దృష్టికి రాలేదని ఎక్సైజ్ అధికారులు దాటవేస్తు నారు. ప్రభుత్వం అండదండలతో ఎక్సైజ్ పోలీస్ అధికారులు మద్యం షాపుల పై బెల్ట్ షాపులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు పలు విధాలుగా చెప్పుకుంటున్నారు. ప్రభుత్వంకు మద్యం విక్రయాలతో వస్తున్న ఆదాయం ఉండడం వల్లనే ఎక్సైజ్, పోలీస్ అధికారులు పలువురు పలుమార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. వైన్ షాపుల వద్ద అదనపు రేట్ల అమ్మకంపై, గ్రామాలలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు వెలుస్తున్న విషయంపై వైన్ షాప్ యాజమాన్యాలను అడిగిన వారిపై దాడులకు పాల్పడుతున్న వైన్ షాప్ యాజమాన్యాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మాత్రమే మద్యం షాపులలో విక్రయించాలని, ఎమ్మార్పీ ధరల పట్టిక వైన్ షాపుల్లో ఏర్పాటు చేయాలని, అదనపు రేట్ల అమ్మకంపై ఫిర్యాదు చేస్తే సంబంధిత ఎక్సైజ్ అధికారులు స్పందించి షాపులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. జిల్లాలో జీరో మద్యం దందా కొన సాగుతున్నట్లు జిల్లా వ్యప్తంగా వస్తున్న వదంతులను జిల్లా ఎక్సైజ్ సూపర్డెంట్ ఆధ్వర్యంలో మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ రేట్ల కంటే అదనపు రేట్లకు అమ్మిన షాపులపై మరియు విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని బెల్ట్ షాపులను ఎత్తివేయాలని ప్రభుత్వానికి పలువురు డిమాండ్ చేస్తున్నారు.