ఏలూరులో ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటన
ఏలూరు: భారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన ఏలూరులోని ముంపుబాధిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆళ్లనాని పర్యటిస్తున్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులకు సహాయ చర్యలు అందడం లేదన్నారు. బాధితులకు కనీసం ఆహారం. మంచినీరు, మందులు కూడా సరిపడా లేదని ప్రభుత్వం, అధికార యంత్రాంగంపై విమర్శలు చేశారు. మంత్రులు, అధికారులు కార్లలో వచ్చి వెళ్తున్నారే తప్ప ప్రజలు పడుతున్న ఇబ్బందుల పరిష్కారానికి దృష్టి చూపే వారే లేరన్నారు. వాళ్లు బాధిత ప్రాంతాల్లో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు
నాడు తమ్మిలేరుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 17 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఓ వైపు రక్షణ గోడ నిర్మించారని, అంతేకాక రెండో వైపు గోడకు 28 కోట్లరూపాయలు కూడా వైఎస్ మంజురు చేశారన్నారు. కానీ రెండో వైపు గోడ నిర్మాణం కానందునే ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.మంత్రులు, అధికారులకు నిధులు విడుదలైన విషయం తెలియకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.