కోతికి భయపడి భవనం పైనుండి దూకిన విద్యార్థి
ఆర్మూర్ ఆగస్టు 12 ( జనంసాక్షి) : ఆర్మూర్ పట్టణంలోని కస్తూరిబా బాలికల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి గతవారం క్రితం కళాశాల భవనం నుండి దూకిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ పట్టణం దుబ్బ ప్రాంతానికి చెందిన కావేరి అనే విద్యార్థి ఆర్మూర్ కస్తూరిబా పాఠశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతుంది.కాగా మొదటి అంతస్తులో కోతిని తన మీదికి దాడికి రావడంతో భయపడి మొదటి అంతస్తు భవనం నుండి క్రిందకి దూకింది.గాయాల పాలైన విద్యార్థిని సరైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది. కళాశాల ప్రాంగణంలో కోతుల బెడద తీవ్రంగా ఉండడమే ప్రధాన కారణంగా తెలిసింది.