ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు వింగ్స్ ఇండియా

– 2020 ఎయిర్ షోలో మంత్రి కెటిఆర్

కెటిఆర్ డైనమిక్ లీడర్ అన్న కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి

హైదరాబాద్,మార్చి 14(జనంసాక్షి): ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో పెట్టుబడుల కు తెలంగాణలో అపార అవకాశాలున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. రీజనల్ కు ఆక్టివిటీని పెంచే ఉద్దేశంతో తెలంగాణలోని పాత ఎయిర్ పోర్టులను పునరుద్ధరిస్తున్నా మని చెప్పారు. రీజనల్ ఎయిర్ పోర్టులతో పా టు.. హెలిపోర్ట్, సీ ప్లేన్ లపై తెలంగాణ ఆస క్తిగా ఉందన్నారు. ఏవియేషన్ రంగం 14 శా తం వృద్ధితో ఎదుగుతోందన్నారు. ఏవియేషన్ రంగంపై జీఎస్టీని తగ్గించేందుకు కేందప్ర భుత్వం నిర్ణయం తీసుకోవాలని మంత్రి కేటీఆర్ కోరారు. మూడోరోజు వింగ్స్ ఇం డియా- 2020 ఎయిర్ షో జరుగుతోంది. ఇందులో కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఏరోస్పేస్, ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు అపార ఎక్కడ అవకాశాలు ఉన్నాయని కేటీఆర్ తెలిపారు. వచ్చే 20 ఏళ్లలో భారత్కు 2,400 ఎయిర్‌క్రాస్టు న్నారు. నిర్వహణ, మరమ్మతుల కేంద్రం, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. ఏరో స్పేస్, ఏవియేషన్ రంగానికి హైదరాబాద్లో అత్యంత అనువైన వాతావరణం ఉందని కేంద్ర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న చేయూతతో లాక్ హీడ్, మార్టిన్, జీఈ, సఫ్రాన్, రాఫెల్, ఎల్ బిట్ వంటి విదేశీ కంపెనీలతో పాటు.. అదానీ వంటి దేశీయ కంపెనీలు హైదరాబాద్లో యూనిట్లు స్థాపించాయన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా వింగ్స్ ఇండియా- 2020 ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. ఇది ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్ షో కావడం విశేషం. ఈ ప్రదర్శన.. మూడో రోజు కార్యక్రమాలకు.. కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి, రాష్ట్రమంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఎయిర్ పోర్టులు, విమానయాన సంస్థలకు స్వచ్ఛ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విమానయానశాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ.. ఎయిర్పోర్టుల్లో కరోనా నివారణకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. మొదట్లో 12 దేశాల నుంచి వచ్చిన వారినే స్క్రీనింగ్ చేశామని.. ఇప్పుడు అన్ని దేశాల నుంచి వచ్చిన వారినీ స్క్రీనింగ్ చేస్తున్నామని తెలిపారు. ఇప్పటి వరకు 12 లక్షల మందికి నింగ్ చేసినట్టు హర్‌దీప్ సింగ్ వెల్లడించారు. కరోనాతో మరణించిన ఇద్దరు వ్యక్తులకూ.. వయస్సు, ఇతర ఆరోగ్య సమస్యలున్నాయని హర్దీప్ సింగ్ తెలిపారు. మంత్రి కేటీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. కేటీఆర్ యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ అని కొనియాడారు. యువ భారత్ కు కేటీఆర్ ఒక ప్రతీక అన్నారు. ఈ మేరకు వింగ్స్ సదస్సును విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించిన కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ఎయిర్ పోర్టుల్లో పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని హర్దీప్ సింగ్ పురి చెప్పారు. ఇప్పటికే ఎయిర్ క్రాఫ్టులు, హెలికాప్టర్ల విన్యాసాలతో అందరినీ కట్టేపడేసిన ఎయిర్ షో ఆదివారంతో ముగియనుంది. దిగ్విజయంగా కొనసాగుతున్న ఈ ప్రదర్శనకు సంబంధించి ముగింపు కార్యక్రమాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు.