ఏసిపికి వినతిపత్రం ఇచ్చిన చెన్నారెడ్డి కూడా రైతులు
రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం, (జనం సాక్షి):- మంచాల మండల పరిధి లోని చెన్నారెడ్డిగూడ గ్రామ రైతుల కు 40 సంవత్సరాల క్రితం ఆరుట్ల గ్రామ రెవెన్యూ ఫరిది సర్వే నెంబర్ 1344, 1347,1348,1349 లలో ప్రభుత్వం బాండెడ్ లేబర్ క్రింద 20 మంది రైతులకు ఒక్కొక్కరికి 1-20 నుండి 1-30 గుంటల వరక 34ఎకరాల లావుని పట్టాలు ఇచ్చి ఫిజికల్ ఫోజిషన్ తో పాటు అన్ని హక్కులను ప్రభుత్వం ఇచ్చింది. మా భూమిలో వ్యవసాయం చేసుకోవడానికి ప్రభుత్వం బావి, చెరువుని త్రవ్వి ఇచ్చింది. సాగులో ఉన్న భూమిని రాజేందర్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమిని కబ్జా చేస్తున్నాడని స్థానిక మంచాల మండల తహసీల్దార్ అనిత కు ఈ నెల 6వ తేదీన ఫిర్యాదు చేసారు మా ఫిర్యాదు పైన తహసీల్దార్ విచారణ చేస్తున్నారు. కానీ మంచాల సిఐ వెంకటేష్ , రైతులకు అండగా నిలుస్తున్న సిపిఐ నాయకులు జొన్నలగడ్డ వెంకటేష్ నాయక్, క్రాంతి కుమార్ ల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశానని చెప్పి స్థానిక ఎస్సై ద్వారా ఫోన్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు అంతకముందు రైతులు సి.ఐ కి ఫిర్యాదు చేయడానికి వెళ్ళగా ఫిర్యాదు స్వీకరించకపోగా రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. రైతుల భూముల విషయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్థుల పక్షాన నిలుస్తున్న మంచాల పోలీసులపై సమగ్ర విచారణ చేయాలని, రైతుల భూముల విషయంలో పోలీసులు జోక్యం చేసుకోకుండా నివారించాలని వినతిలో కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి యాదయ్య, నాయకులు జొన్నలగడ్డ వెంకటేష్,బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు