ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఆదిలాబాద్ : మందమర్రి మండలం తిమ్మాపూర్ వీఆర్‌వో చందు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు చందును అదుపులోకి తీసుకున్నారు. వీఆర్‌వో చందు ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. రూ. 8 లక్షలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.