ఏ.వి.నర్సింగరావు జీవితం విలక్షణం, ఆదర్శం
– శతజయంతి ఉత్సవాల్లో సీఎం కేసీఆర్
హైదరాబాద్ అక్టోబర్14(జనంసాక్షి): జేవీ నర్సింగరావు విలక్షణమైన వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం మంచిని… చెడునూ భరిస్తూ వెళ్లిన వ్యక్తి నర్సింగరావు. ఆయన జీవితం ఆదర్శమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గ్రాండ్ కాకతీయలో బుధవారం నాడు జరిగిన కార్యక్రమంలో జేవీ నర్సింగరావు శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. జీవీ బతికి ఉండి ఉంటే ఉన్నతస్థాయికి వెళ్లేవారు. నర్సింగరావు విశిష్టతను ముందు తరాలకు తెలియజేసేందుకు వారి కుటుంబసభ్యులతో మాట్లాడి నిర్ణయిస్తాం.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వ్యక్తిగతంగా విమర్శించినా అందరినీ కలుపుకుపోయిన వ్యక్తి నర్సింగరావు. ఇటివలే కాకా విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ విూద ప్రతిష్టించినందుకు సంతోషపడ్డాం. పీవీ నర్సింహారావును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విస్మరించింది. ఎంతో మంది పోరాటం చేస్తారు కానీ పోరాటం చేసి సాధించుకున్న వ్యక్తివి నీవు అని నన్ను రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అభినందించారు. తలపోయినా తప్పు చేయం. ఇప్పుడు వేసే ఒక తప్పటడుగు రెండు తరాలకు నష్టం కలిగిస్తుంది. ఎవరో ఏదో అన్నారని ఆదుర్దాతో పనిచేయం.రాజకీయాల్లో అవకాశాలు, పదవులు శాశ్వతం కాదు. రాజకీయాల్లో విపరీతమైన అసహన వైఖరి పెరిగింది. సహనశీలత పెంచుకుంటూ ముందుకు సాగితే దేశానికి మంచిది. ఎవరు అవునన్నా.. కాదన్నా… పీవీ తెలంగాణ ఠీవీ అన్నారు.ఈ
కార్యక్రమంలో ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎంపీ కే.కేశవరావు, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.