ఐఎంఏ జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ “పంతగాని” రెండోసారి ఏకగ్రీవం.

వైద్యరగంలోనూ సామాజిక సేవలలో డాక్టర్ పంతగాని పెంచలయ్య ప్రత్యేక ముద్ర.

అభినందించిన మానేరు స్వచ్ఛంద సంస్థ.

సిరిసిల్ల. అక్టోబర్ 15.(జనం సాక్షి). వైద్యరంగంలోనూ సామాజిక సేవలకు ప్రత్యేకంగా నిలిచిన డాక్టర్ పంతగాని పెంచలయ్య రాజన్న సిరిసిల్ల జిల్లా ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా ప్రజలను వైద్యులను సమన్వయం చేస్తూ మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందేలా ప్రత్యేకంగా చర్య తీసుకున్న తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. రికార్డుల స్థాయి ఆపరేషన్లు నిర్వహించి సక్సెస్ సాధించిన ఘనత డాక్టర్ పంతగాని పెంచలయ్య సొంతం చేసుకున్నారు. సిరి స్వచ్ఛంద సంస్థ ద్వారా డాక్టర్ పంతగాని పెంచలయ్య శోభారాణి దంపతులు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పేదరికంతో చదువుకు దూరం అవుతున్న ఎంతో మంది విద్యార్థులకు అక్షర నేస్తాలై చేయుత అందించారు. పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. జిల్లాలో డాక్టర్ పంతగాని పెంచలయ్య అందిస్తున్న వైద్య సామాజిక సేవలతో ప్రజలకు చేరువయ్యారు. ఐఎంఏ జిల్లా అధ్యక్షులుగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ పెంచలయ్యను మరోసారి జిల్లాలోని వైద్యులందరూ తిరిగి రెండవసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం గమనార్హం. డాక్టర్ పంతగాని పెంచలయ్య రెండోసారి జిల్లా అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల హర్షo వ్యక్తం చేస్తూ మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజుభాస్కర్, ఎల్లారెడ్డిపేట అశ్విని హాస్పిటల్స్ డాక్టర్ సత్యనారాయణలు శాలువాను కప్పి మేముంటోను అందజేసి అభినందనలు తెలిపారు.