ఐఎఫ్‌ఎస్‌కు తొలి ప్రయత్నంలోనే ఎంపిక
86వ ర్యాంక్ సాధించిన కాసర్ల రాజుకు అభినందన
లక్ష ప్రోత్సాహకం అందించిన మంత్రులు
హైదరాబాద్,జూలై8(జనం సాక్షి):తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఎఫ్‌ఎస్‌లో ఆలిండియా 86వ ర్యాంకు సాధించిన కాసర్ల రాజును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ సన్మానించారు. ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆధ్వర్యంలో అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఎఫ్‌సీఆర్‌ఐ తరపున లక్ష రూపాయాల ప్రోత్సాహకాన్ని రాజుకు అందజేశారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ అడవులు, పర్యావరణ రక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నారని అన్నారు. అటవీ విద్యను ప్రోత్సహించాలన్న సంకల్పంతో పాటు జాతీయ స్థాయి అధికారులను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను నెలకొల్పారన్నారు. ఇది స్థాపించిన అనతి కాలంలోనే కాసర్ల రాజు వంటి వారు తొలి ప్రయత్నంలోనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సాధించడం అటవీ కళాశాలకు గర్వకారమన్నారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం సూరారం గ్రామంలోని ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన రాజు ఎంతో కష్టపడి ఐఎఫ్‌ఎస్ సాధించి.. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని నిరూపించాడన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా విద్యార్థులకు ఉన్నతమైన విద్యా బోధనను అందించేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ ఉన్నాతధికారులు, ఈఅఖీఎ డీన్ ప్రియాంక వర్గీస్, అధ్యాపకులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిం చారు. ఐఎఫ్‌ఎస్ ర్యాంకర్ రాజు మాట్లాడుతూ..తనకు తన పేరెంట్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారన్నారు. అలాగే
కాలేజీ నుంచి మంచి గైడెన్స్ లభించిందన్నారు. తన జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి ఈ క్రెడిట్ దక్కుతుందని, వారందరికీ రాజు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్‌ఎం డోబ్రియాల్, పీసీసీఎఫ్ (కంపా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్) లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ ఎంసీ ప్గ్గంªయిన్, డిప్యూటీ డైరెక్టర్ కె. శ్రీనివాస్, డీసీఎఫ్ ఎ.నరసింహ రెడ్డి పాల్గొన్నారు.