ఐదేళ్ళ పూర్తి కాలం సిఎంగా సిద్దరామయ్య

బెంగళూరు,మే14(జ‌నం సాక్షి): దేశంలో ఆసక్తితో పాటు ఉత్కంఠను రేకిత్తిస్తున్న కర్ణాటక ఎన్నికల పక్రియ మంగళవారంలెక్కింపుతో ముగియనుంది. సాయంత్రానికల్లా ఏ పార్టీ అధికరాంలోకి రాగలదో తేలనుంది. 
దీంతో పాటు  పార్టీ జెండాతో పాటు ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఖరారు కానున్నారు. ఇదిలా ఉంటే కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేసి 5 ఏళ్లు పూర్తయ్యాయి. 2013 మే 13న ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన ఐదేళ్ల సీఎం ప్రస్థానం గురించి వివరించుకొచ్చారు. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈతరవాత  ఈ ఐదేళ్లలో రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు రాష్ట్రాభివృద్ధికి, ప్రజలకు నేనేం చేయాలనుకున్నానో దాదాపుగా అన్నీ చేశాను. ఇదంతా ప్రజల సహకారంతోనే చేశాను. ఇకపై కూడా నాకు ఆ సహకారం, మద్దతు నాకు ఉంటుందని ఆశిస్తున్నాను. అయినప్పటికీ రాష్ట్రాభివృద్ధిపై సంతృప్తిగా లేను. రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించే విధంగా పనిచేస్తానని ప్రజలకు హావిూ ఇస్తున్నాను అని సిద్ధరామయ్య పేర్కొన్నారు. తదుపరి సీఎం గురించి అడిగగా ఇంకొక్క రోజు వేచి చూస్తే సరిపోతుందని బదులిచ్చారు. ఈ నెల 12న ఓటింగ్‌ జరగా 15న ఫలితాలు వెలువడనున్నాయి.