ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక మాస వారోత్సవాలు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారా న్ని సద్వినియోగం చేసుకోవాలి.
సిడిపిఓ ఆ వెంకటరమణ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్27(జనంసాక్షి):

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషక మాస వారోత్సవాలు కొల్లాపూర్ సిడిపిఓ వెంకటరమణ ఏసీ సిడిపిఓ భాగ్యమ్మ సూపర్వైజర్లు జయలలిత జంగమ్మ ఎంపీటీసీ శశికళ ఆధ్వర్యంలో పెద్దకొత్తపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ లో పోషక మాస వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె అన్నారు .ప్రభుత్వం అందిస్తున్న పాలు, గుడ్లు ,బాలామృతం, ఆకుకూరలతో వండిన ఆహారాన్ని రోజు అంగన్వాడి కేంద్రాల్లో భోజనం చేయాలన్నారు. మండలంలోని అంగన్వాడి టీచర్లు తయారు చేసినటువం టి పౌష్టికాహారం వంటలను అందరికీ పంపిణీ చేశారు. అంగన్వాడి చిన్నారులకు అన్నప్రాయాసం చేశారు. వయోవృద్ధులు వికలాంగుల కమిటీల ద్వారా గ్రామాల నుండి వచ్చిన వారిని సన్మానం చేశారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో ఆడి సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బి జ్యోతి, నిర్మల, శివ లీల, అంజనమ్మ ,గీత,కృష్ణవేణి, మంజుల, ఏఎన్ఎంలు , ఆశా వర్కర్లు వృద్ధులు,వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.