ఐసిడిఎస్ ఆధ్వర్యంలో “స్వరక్ష డే”
బోనకల్ ,అక్టోబర్ 15 (జనం సాక్షి): బోనకల్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో శనివారం స్వరక్ష డే సందర్భంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీడీపీఓ కమలప్రియ మాట్లాడుతూ ఆరవ తరగతి నుండి ఇంటర్ వరకు గల బాలికలకు బాల్యవివాహాలు ,సంపూర్ణ సమతుల్య ఆహారం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత , రక్తహీనత, చదువు ,మానవ అక్రమ రవాణా , మంచి అలవాట్లు అలవర్చుకోవడం వంటి అంశాల గురించి వివరించారు .అదేవిధంగా చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్లు 1098, 112, 181 గూర్చి బాలికలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్లోబల్ హ్యాండ్ వాష్ డే లో భాగంగా పిల్లలకు 9 రకాలుగా చేతులను శుభ్రపరచుకోవడం గూర్చి వివరించి వారితో కలిసి చేయించారు.మానవ అక్రమ రవాణాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఐసీడీస్ ప్రాజెక్టుల్లో ప్రతి నెల మూడో శనివారం ‘స్వరక్ష డే’ను నిర్వహిస్తున్నామని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు 100, మహిళా హెల్ప్‌లైన్ 181, మహిళా కమిషన్ వాట్సప్ నంబర్ 94905 55533, 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కమలవాహిని, ఏసిడిపిఓ కమల ప్రియ, సూపర్వైజర్ రమాదేవి, వైస్ ఎంపీపీ రమేష్, ఏఎన్ఎం సరస్వతి, అంగన్వాడీ టీచర్లు రమాదేవి, శిరీష ,శివనాగేంద్ర , ఆశాలు తులసి, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.