ఐసిసి నిర్ణయంపై చందా కొచ్చార్‌ దావా

ముంబై,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): చందాకొచ్చర్‌ కేసులో ఆర్‌బిఐకి బాంబే హైకోర్టు నోటీసులు జారీ చేసింది. బ్యాంకు విధుల నుంచి తప్పించే నిర్ణయాన్ని ఆర్‌బిఐ ఆమోదించడాన్ని ఐసిఐసిఐ బ్యాంకు మాజీ సిఇఒ చందాకొచ్చర్‌ ముంబై హైకోర్టులో సవాలు చేశారు. ఆర్‌బిఐ నిర్ణయంపై ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనను గత మార్చి 13న కొచ్చన తొలగింపు నిర్ణయానికి ఆర్‌బిఐ ఆమోదముద్ర వేసింది. ఆమెను జనవరి 31న బ్యాంకు యాజమాన్యం విధుల నుంచి తప్పించింది. ఆర్‌బిఐ నుంచి అనుమతి రాకుండానే తనను విధుల నుంచి ఎలా తొలగిస్తారని కొచ్చర్‌ ప్రశ్నించారు. ఇప్ప టికే ఆమె ఐసిఐసిఐ బ్యాంకు నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయస్థానంలో కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ఆర్‌బిఐను కూడా ప్రతి వాదిగా చేర్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఆర్‌బిఐకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తర్వాత విచారణ డిసెంబరు 18న జరగనుంది. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసిఐసిఐ బ్యాంకు రుణం ఇవ్వడంపై గతేడాది దుమారం చెలరేగిన విషయం విదితమే. దీంతో బ్యాంకు బోర్డు తాత్కాలికంగా కొచ్చర్‌ను బాధ్యతల నుంచి తప్పించింది.