ఐ ఓ టి టి లో రామచంద్రాపురం సినిమా
వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 08(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని రంగశాయి పేట సాయి నగర్ కు చెందిన శ్రీ రామానుజన్ నరేంద్రనాథ్ దర్శకత్వం లో ” రామచంద్రపురం ” సినిమా దసరా సందర్భంగా ఐ ఓటిటి లో రిలీజ్ అయినది. ఈ మేరకు సినిమా దర్శకులు నరేంద్రనాథ్ శనివారం తెలిపారు. ఈ సినిమా పూర్తిగా వరంగల్ జిల్లా సంగం మండలం రామచంద్రాపురం గ్రామం తోపాటు వరంగల్ పరిసర ప్రాంతాల్లో నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోగా ప్రశాంత్, వరంగల్ వందన ఫేం ఐశ్వర్య మరియు సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా మరియూ తదితరులు నటించారు, గేయా రచన ఆడెపు రవీందర్, ప్రొడ్యూసర్ గా నిహాన్ కార్తికేయన్, కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం రామానుజన్ నరేంద్రనాథ్ వ్యవహరించినట్లు తెలిపారు