ఒకరికి గ్రామ అధ్యక్ష పదవి, ఒకరికి పార్టీ నుండి సస్పెన్షన్

రుద్రూర్(జనంసాక్షి):-
రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామ తెరాస పార్టీ అధ్యక్షుడిగా మంచిని కిష్టయ్యను శుక్రవారం రోజున తెరాస పార్టీ అక్బర్ నగర్ గ్రామ అధ్యక్షుడిగా అధిష్టానం ఆదేశాల మేరకు ప్రకటించడం జరిగినదని తెరాస మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, జడ్పీటిసి నారోజి గంగారాం, మండల ముఖ్య నాయకుడు అక్కపల్లి నాగేందర్ మండల నాయకుల తో కలిసి జనంసాక్షి తో తెలిపారు , ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
కిష్టయ్య రాజకీయ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీని సమర్దవంతముగా ముందుకు నడిపిస్తూ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకునే అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఎం కిష్టయ్య ను గ్రామ అధ్యక్షుడిగా ప్రకటించడం జరిగిందని తెలిపారు. అలాగే పార్టీ నియమాలను అతిక్రమించిన వారిని అధిష్ఠానం సహించదని తెలుపుతూ రుద్రూర్ మండల తెరాస మండల మైనారిటీ సెల్ ఉపాద్యక్షుడిగా ఉన్న షేక్ అంజాద్ ను అధిష్టానం ఆదేశాల మేరకు తెరాస పార్టీ నుండి మరియు పార్టీ సభ్యత్వం నుండి సస్పెండ్ చేయడం జరిగినది తెలిపారు. షేక్ అంజాద్ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా , పార్టీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, పార్టీకి నష్టం వాటిల్లే విధంగా ప్రవర్తించి నందున సస్పెండ్ చేయడం జరిగిందని పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరికి పై ఇదే విధంగా చర్యలు ఉంటాయని కావున ప్రతి ఒక్కరు అధిష్టానం ఆదేశాలను పాటించాలని, క్రమశిక్షణ గా మెలగాలని ప్రతి కార్యకర్తను కోరారు తెరాస మండల అధ్యక్షుడు పత్తి లక్ష్మణ్, జడ్పీటిసి నారోజి గంగారాం, మండల ముఖ్య నాయకుడు అక్కపల్లి నాగేందర్, నెరగంటి బాలరాజు, తొట్ల గంగారాం, మొద్దుల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు