ఒక్క సిసి కెమెరా పది మంది పోలీసులతో సమానం గ్రామాల్లో ఉన్న యువకులు నేతలు వివేకులు అందరూ కలిసి గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

చందంపేట (జనం సాక్షి) సెప్టెంబర్ 30
 నెరెడిగొమ్ము  మండలం గ్రామంలో కూడా సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ కోరారు.శుక్రవారం నేరడుగొమ్ములో సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ఒక్క సిసి కెమెరా పది మంది పోలీసులతో సమానం అని ఆయన అన్నారు.గ్రామాల్లో ఉన్న యువకులు నేతలు వివేకులు అందరూ కలిసి గ్రామాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి అని ఆయన కోరారు.తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ఎన్నో పథకాలను అమలు చేస్తూ నిధులను ఖర్చు చేస్తుంది అని ఆయన గుర్తు చేశారు.గ్రామాలను అద్భుతమైన అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి గారికి మనం రుణపడి ఉన్నాం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య,ఎంపీపీ బాణావత్ పద్మహన్మ    జెడ్పీటీసీ  బాలుు    పి ఎ సి ఎస్  చైర్మన్ ముక్కమల్ల బాలయ్య,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు లోకసాని తిరపతయ్య,రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య  సిఐ పరిషారాం గోపాల్ రెడ్డి,స్థానిక సర్పంచ్ పల్స బలమణివెంకటయ్య  వైస్ ఎంపీపీ అరేకంటి ముత్యాలమ్మ రాములు   వాంకునవత్ బిక్కు,కోో ఆప్షన్ సభ్యులు పాషా వాడిత్య బాలు  బైరెడ్డి కొండల్ రెడ్డి  బషీర్  ఎంపీడీఓ ఝాన్సీలక్ష్మి    తదితరులు పాల్గొన్నారు