ఒక రోజు లక్ష మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
నల్గొండ బ్యూరో, జనం సాక్షి.  నల్గొండ జిల్లా కేంద్రంలో ఒకరోజు ఈ నెల 19 న లక్ష మొక్కలు నాటే బృహత్తర కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. మంగళవారం నల్గొండ మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి తో కలిసి జిల్లా కేంద్రం లో లక్ష మొక్కలు నాటే కార్యక్రమంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 19న  నల్గొండ జిల్లా కేంద్రంలో లక్ష మొక్కలను నాటాలని నిర్ణయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ఈనెల 19న తెలంగాణ హరితహారం కార్యక్రమం  ఓ ఎస్ డి ప్రియాంక వర్గిస్ హాజరవుతున్నట్లు తెలిపారు. ఆమె రాక సందర్భంగా పట్టణ శివారులోని ఎస్ఎల్బీసీ ప్రాంతంలో ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. లక్ష మొక్క 60,000 హెచ్ఎండిఏ నుండి మరో 40000 ములుగు జిల్లా నుండి బుధవారం సాయంత్రం వరకు జిల్లా కేంద్రానికి వస్తాయని తెలిపారు. లక్ష మొక్కలను పట్టణంలోని ప్రతి ప్రాంతాలలో నాటాలని ఇందుకుగాను 10 మంది స్పెషల్ ఆఫీసర్లను 17 మంది సూపర్వైజర్ అధికారులను నియమించినట్లు తెలిపారు. ఇందుకుగాను మరో 70 మంది అధికారులను అదనంగా వినియోగిస్తున్నట్లు తెలిపారు. నాటిన మొక్కలను పరిరక్షించేందుకు మున్సిపాలిటీ అధికారుల బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. నాటిన మొక్కలు చనిపోయిన వాటి స్థానంలో కొత్తవి పెట్టడం నీరు పోయడం లాంటివి మున్సిపాలిటీ అధికారులు పర్యవేక్షిశించాలని తెలిపారు. ఇప్పటికే పట్టణంలో మొక్కలు నాటేందుకు గుంతలను తీయించడం జరుగుతుందని తెలిపారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి లక్ష మొక్కల నాటే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నల్గొండ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ కమిషనర్ డాక్టర్ కె.వి రమణాచారి జిల్లా అధికారులు జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారి రాంబాబు జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి మహిళా సంక్షేమ శాఖ అధికారి సుభద్ర సిడిపిఓ నిర్మల ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ సల్మా భాను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ పుష్పలత పర్యావరణ అధికారి సురేష్ బాబు ఉద్యానవన శాఖ అధికారి సంగీతలక్ష్మి తదితరులున్నారు