ఒరియా రచయితకు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రాస్ట్‌ అవార్డు

హైదరాబాద్‌ : సాహిత్య రంగానికి విశిష్ఠ సేవలందించిన ప్రముఖ ఒరియా రచయిత మనోజ్‌దాస్‌కు ఎన్టీఆర్‌ జ్ఞాన ట్రస్ట్‌ అవార్డు అందించనున్నట్లు ట్రస్ట్‌ వ్యవస్థాపకురాలు లక్ష్మీపార్వతి చెప్పారు. శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఏటా ఎన్టీఆర్‌ జయంతిని పురష్కరించుకుని అందిస్తున్న ఈ అవార్డుకు రూ.లక్ష పురస్కారంతో పాటు ఎన్టీఆర్‌ జ్ఞాపికను అందివ్వనున్నట్లు తెలిపారు. సాహిత్య రంగంపై ఎన్టీఆర్‌కు ఉన్న మక్కువను ప్రజలో నిలిపేందుకే ఈ అవార్డును కొనసాగిస్తున్నటు ఆమె చెప్పారు. ఇప్పటి వరకు ఆరు భాషల్లో ప్రముఖ రచయితలకు ఈ అవార్డును ప్రదానం చేసినట్లు లక్ష్మీపార్వతో వెల్లడించరు.