ఒలంపిక్స్‌లో పతకం సాధించడం గర్వంగా ఉంది:సైనా నెహ్వల్
హైదరాబాద్: లండన్ ఒలంపిక్స్‌లో తన ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నానని, ఇలంపిక్స్‌లో పతకం సాధించటం గర్వంగా ఉందని భారతీయ స్టార్ షట్లర్ సైనా నెహ్వల్ పేర్కొంది. తాను శిక్షణ పొందిన గోపీచంద్ అకాడమికి చేరుకున్న సైనాకు అభిమానులు, సహచరక్రీడాకారులు ఘన స్వాగతం పలికారు. అందరి సహకారంతో విజయం సాధించానని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించగలనని ఆశా భావం వ్యక్తం చేసింది.