ఓటమి అంచుల్లో ఇంగ్లండ్
పెర్త్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓటమి అంచుల్లో చిక్కుకుంది.279 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ తడబడుతూ వరుస వికెట్లను చేజార్చుకుంది. 98 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది.
ఇంగ్లండ్ ఆటగాళ్లలో మొయిన్ ఆలీ(26),రూట్(25) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్ కు మూడు వికెట్లు లభించగా,మ్యాక్స్ వెల్ కు రెండు వికెట్లు దక్కాయి.