ఓటరు అవగాహన వాహనాలు ప్రారంభం
హైదరాబాద్, అక్టోబర్23(జనంసాక్షి) : ఓటరు అవగాహన వాహనాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రావత్ మంగళవారం ప్రారంభించారు. తాజ్‌కృష్ణ ¬టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను రావత్ జెండా ఊపి ప్రారంభించారు. ఓటును ఎలా వినియోగించుకోవాలనే దానిపై ఎన్నికల సిబ్బంది ఈ వాహనంలో ఊరూరా తిరిగి అవగాహన కల్పించనున్నారు. సాధారణ ఓటర్లతో పాటు దివ్యాంగులు, అంధులు కూడా ఓటు హక్కు ఏ విధంగా వినియోగించుకోవాలనే దానిపై వాహనంలో సౌకర్యాలు కల్పించారు. ఈ వాహనాన్ని ప్రారంభించిన అనంతరం ఇతర ఎన్నికల అధికారులతో కలిసి రావత్ వాహనాన్ని పరిశీలించారు. వాహనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను అధికారులు ఆయనకు వివరించారు..