ఓటర్ కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేసుకోండి
తహసీల్దార్ చిన్నప్పలనాయుడు
తాండూరు రూరల్ ఆగస్టు 28 ( జనం సాక్షి): ప్రతి ఒక్కరూ తమ తమ ఓటర్ కార్డుకు ఆధార్ నెంబర్ ను అనుసంధానం చేసుకోవాలని తహసీల్దార్ చిన్నప్పల నాయుడు వెల్లడించారు. తాండూరు మండల తహసీల్దార్ చిన్నప్పలనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో విలేకరులతో మాట్లాడుతూ.. అంగన్వాడీ టీచర్లు గ్రామాలలో పర్యటించి ఓటరు కార్డుకు ఆధార్ నెంబర్ అనుసంధానం చేయిస్తున్నారని వారికి ప్రజలు సహకరించాలని కోరారు.
