ఓటునమోదు చేసుకోవాలి
మెదక్,జనవరి24(జనంసాక్షి): 18 సంవత్సరాలు నిండిన ప్రతి యువతీ, యువకులు ఓటుహక్కును పొందేందుకు గాను విూ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఓటును పొందడం అర్హులందరి హక్కు అని తప్పనిసరిగా ఓటుహక్కును కల్గి ఉండాలన్నారు. ఓటుహక్కు, నగదు రహిత లావాదేవీలపై ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహానికి కేంద్రాల నిర్వాహకులతో పాటు ప్రతి ఒక్కరూ తమ వంతుగా తోడ్పాటును అందించాలని ఆయన కోరారు. అదే విధంగా తప్పకుండా నగదురహిత లావాదేవీలను విద్యావంతులు ప్రోత్సహించాలని తెలిపారు. తమకు సాధ్యమైన రీతిలో అవగాహన కల్పించి నగదురహిత లావాదేవీలను జరిపించాలన్నారు. విూ సేవ కేంద్రాల ద్వారా కూడా నగదురహిత లావాదేవీలను జరుపుకోవచ్చని తెలిపారు.