అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నగరంలో పలువురు సినీ ప్రముఖులు ఓటుహక్కును వినియోగించుకున్నారు.జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఓటు వేశారు. జూబ్లీహిల్స్ క్లబ్‌లో నటుడు సుమంత్ ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో సినీ నటుడు అల్లు అర్జున్ ఓటు వేసేందుకు బారులు తీరారు.జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు అల్లు అర్జున్.ఓబుల్ రెడ్డి స్కూల్ లో తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, కుటుంబ సభ్యులు. ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు ప్రకాష్ రాజ్.. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు ఉదయం ఎనిమిది గంటలకు జూబ్లీ హిల్స్ క్లబ్బులో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబంతో కలిసి ఆయన వచ్చారు. చిరు వెంట కుమార్తె శ్రీజ కూడా ఉన్నారు. చిరంజీవి తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఓటు హక్కు వినియోగించుకుంటారని సమాచారం ఇచ్చారు. ఓటు వేయడం కోసం మైసూరులో జరుగుతున్న ’గేమ్ ఛేంజర్’ చిత్రీకరణకు చిన్న విరామం ఇచ్చి మరీ ఆయన హైదరాబాద్ వచ్చారు. ఇదిలావుంటే మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్‌లోని 375వ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును వినియోగించు కున్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని ఓటు హక్కు చాటుతుందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటుహక్కును తప్పనిసరిగా వినియోగించు కోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు ఓటు వేయడాన్ని తమ బాధ్యతగా భావించి.. పోలింగ్‌లో పాల్గొనాలన్నారు.