ఓటు హక్కును ఎలాంటి అడ్డంకులు లేకుండా సద్వినియోగం చేసుకునేలా స్వచ్ఛందంగా ఆధార్ అనుసంధానం చేసుకోండి
హైదరాబాద్ సిటీ, అక్టోబర్ 10 జనంసాక్షి:
ఓటరు జాబితాలో బోగస్, డుప్లికేట్ పేర్లను లేకుండా చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలో గల పేరుకు ఆధార్ అనుసంధానం స్వచ్ఛందంగా చేసుకొనుటకు ప్రజా ప్రాతినిధ్యం చట్టంను సవరించినట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ తెలిపారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటర్లదే కీలకం. ఓటు హక్కును ఎలాంటి అడ్డంకులు లేకుండా సద్వినియోగం చేసుకునేలా స్వచ్ఛందంగా ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది.జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు వయస్సు పూర్తయిన వారు ఓటరు నమోదు చేసుకోవాలని కమిషనర్ కోరారు. నూతన ఓటరుగా నమోదు చేసుకునే వారు ఆన్ లైన్ లో అయితే www.nvsp in గాని, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చును. ఆప్ లైన్ లో చేసుకునే వారు సంబంధిత బి ఎల్ ఓ కానీ ఇ ఆర్ కు గాని సంప్రదించి ఆధార్ అనుసంధానం, నూతన ఓటరు నమోదు చేసుకోవచ్చునని కమిషనర్ తెలిపారు.
ReplyForward
|