ఓటేస్తే ఉచిత రేషన్
ప్రధాని మోడీ బంపర్ ఆఫర్
సంపదను లూటీ చేసిన వారి సంగతి తేలుస్తాం
అహంకార సిఎంకు ఓబిసిలు ఓటుతో బుద్ది చెప్పాలి
కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల డీఎన్‌ఏ ఒక్కటే..
ఢంకా భజాయించి చెబుతున్నా బీఆర్‌ఎస్ ఓటమి ఖాయం
బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోడీ వ్యాఖ్యలు
హైదరాబాద్ (జనంసాక్షి):పేదలకు ఐదేళ్లపాటు ఉచితంగా బియ్యం అందిస్తామని, పేదలకు ఉచిత రేషన్ ఇస్తామని, ఇది మోదీ ఇస్తున్న గ్యారెంటీ అని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. భారాస నేతల్లో అహంకారం కనిపిస్తోందని, అవినీతి సర్కారును ఇంటికి పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. తెలంగాణలో భాజపా సర్కారు వస్తుందని చెప్పారు. అవినీతి సొమ్ము తిన్న ఏ ఒక్కరిని వదిలేదే ప్రసక్తే లేదని, ఖచ్చితంగా జైల్లో వేస్తామని అన్నారు. అవినీతిని అంతం చేయడంతో పాటు ప్రజాధనాన్ని ఎవరు దోచుకున్నారో వారిని వదిలిపెట్టేది లేదని, దోచుకున్న ప్రజాధనాన్ని తిరిగి రాబడుతామన్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన భాజపా బీసీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ ముఖ్యఅథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారాస, కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘‘పుణ్యభూమి తెలంగాణకు ప్రణామాలు. బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొనడం నా అదృష్టం. విూ ఆశీర్వాదంతోనే నేను ప్రధాని అయ్యాను. విూ ఆశీర్వాదంతోనే భాజపా బీసీ వ్యక్తి తెలంగాణ సీఎం అవుతారు. అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం వచ్చింది. నీళ్లు, నిధులు, నియామకాలపై భారాస మోసం చేసింది. తొమ్మిదేళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ విరోధి అధికారంలో ఉన్నారు. బీసీల ఆకాంక్షలను ఎప్పుడూ భారాస పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చాక బీసీలను మోసం చేశారు. తెలంగాణ ప్రజలు భాజపాపైనే విశ్వాసంతో ఉన్నారు. అవినీతి, కుటుంబ పాలన, బుజ్జగింపు రాజకీయాలు భారాస, కాంగ్రెస్ లక్షణాలు. బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది భాజపా మాత్రమే. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చింది భాజపానే. అబ్దుల్ కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారు. పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్ చేసింది, రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది, గిరిజన మహిళ ద్రౌపదిముర్మును రాష్ట్రపతిని చేసింది భాజపానే. ఓబీసీ అయిన నన్ను ప్రధానిని చేసింది భాజపానే. ఓబీసీ కేంద్రమంత్రులు ఎక్కువగా ఉన్నది ఎన్డీఏ హయాంలోనే. ఓబీసీలకు ఎంపీలుగా ఎక్కువ అవకాశాలిచ్చింది భాజపానే. బీసీ యువత కోసం భారాస ఏవిూ చేయట్లేదు. బీసీలకు రూ.లక్ష ఇస్తామన్న వాగ్దానాన్ని భారాస నెరవేర్చలేదు. మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. విశ్వకర్మ పథకం ద్వారా బీసీలకు అవకాశాలిచ్చాం’ అని తెలిపారు. బీఆర్‌ఎస్ నేతలకు ఢల్లీి లిక్కర్ స్కామ్‌తో లింకులు ఉన్నాయని, లిక్కర్ స్కామ్‌ను దర్యాప్తు చేస్తుంటే ఈడీ, సీబీఐని ఇక్కడి నేతలు తిడుతున్నారని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల డీఎన్‌ఏలు ఒక్కటేనని, ఈ రెండు పార్టీలు అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు ఓకే రకంగా ఉన్నాయన్నాయనిధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్‌ఎస్ సీ టీమ్ అని ఆరోపించిన మోడీ.. గడిచిన 9 ఏళ్లుగా బీసీ, ఎస్సీ, ఎస్సీ విరోధి అధికారంలో ఉన్నారని దుయ్యబట్టారు.
బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం
గతంలో తాను ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో తనకు ప్రజల ఆశీర్వదించారు. దాంతో తాను దేశానికి ప్రధాని అయ్యాను. తెలంగాణలో బీజేపీ సర్కార్ ఏర్పడితే బీసీ వ్యక్తినే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు. బీసీ ఆత్మగౌరవ సభలో భాగం కావడం నా అదృష్టం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత స్థానం, గౌరవం ఇచ్చిన ఏకైక పార్టీ బీజేపీ అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీసీ యువత కోసం బీఆర్‌ఎస్ ఏమి చేయట్లేదు. బీసీలకు రూ.లక్ష ఇస్తామని వాగ్ధానం చేసి నెరవేర్చలేదన్నారు. కానీ తమ పాలనలో మెడికల్, డెంటల్ సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. ఈ సభలో నిరుద్యోగుల సమస్యను మోడీ ప్రస్తావించారు. బీఆర్‌ఎస్ సర్కార్ నిర్వాకం వల్ల ఒక తరం భవిష్యత్ నాశనం అయిందని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్ వైఫల్యం వల్ల టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అయ్యాయని, వేల సంఖ్యలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్న భర్తీ చేయలేదన్నారు. బీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం కనిపిస్తోందన్న మోడీ.. 2019 లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు వారికి గుణపాఠం చెప్పారు. తెలంగాణ యువతను మోసం చేస్తున్న బీఆర్‌ఎస్ సర్కార్ వెళ్లిపోవాలా? వద్దా అని ప్రశ్నించారు. ఢంకా బజాయించి చెబుతున్న బీఆర్‌ఎస్ ఇంటికి పోవడం ఖాయమన్నారు.