ఓపీసీలో కార్మికుల విధుల బహిష్కరణ
వరంగల్: భూపాలపల్లి ప్రాంతంలోని కాకతీయ ఓపెన్ కాన్ట్ ఖనిలో ప్లేడేలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఈ ఉదయం విధులు బహిష్కరించారు. జనరల్ మజ్దూర్ కార్మికులకు ప్రతి ఆదివారం 70 శాతం మందికి ప్లేడేలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనలతో 35 వందల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతర్జాయం ఏర్పడింది.