ఓపెన్ కాన్ట్‌లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
వరంగల్: భారీ వర్షం కారణంగా భూపాలపల్లి కాకతీయఖని ఓపెన్ కాన్ట్ ప్రాజెక్టులో శనివారం బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షం కురుస్తున్న కారణంగా యంత్రాలు, వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దాదాపు 3000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది.