ఔను రామాంజనేయులు రక్తం తాగిండు
హెచ్‌ఆర్సీ షాక్ శ్రీఆయన హయాంలో జరిగినవన్నీ బూటకపు ఎన్‌కౌంటర్లే
బాధితులకు పరిహారం చెల్లించాలి
ఫేక్ ఎన్‌కౌంటర్ల పై జాతీయ మానవ హక్కుల కమిషన్ సంచలన తీర్పు వెలువరించింది గ్రేహౌండ్స్ ఐజీ సీపీ సీతరామాంజనేయులకు ఊహించని షాక్ తగిలింది. ఆయన గుంటూరు, కర్నూలు జిల్లాల ఎస్పీగా పని చేసిన సమయంలో జరిగిన ఎన్‌కౌంటరన్నీ బూటకమేనని తేల్చిచెప్పింది. 2002 లో రామాంజనేయులు రెండు జిల్లాల ఎస్పీగా పని చేసిన సమయంలో మొత్తం 19 మంది ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో 16 బూటకమేనని ఎన్‌హెచ్ ఆర్సీ స్పష్టం చేసింది. సీతారామాంజనేయలు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషన్, మృతుల కుటుంబాలకే రూపాయాలు 5 లక్ష చచొప్పున నష్ట పరిహార చెల్లించాలని ఆదేశించింది. 2002లో కర్నూలు, గుంటూరు జిల్లాలో రామాంజనేయులు ఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో కొందరు దోపిడి దొంగలతో పాటు కొంత రాజకీయ నేతల అనుచరులు ఎన్‌కౌంటర్లో మరణించారు. ఆ ఎన్‌కౌంటర్లన్ని బూటకమని గుంటూరు జిల్లా కమిషన్ చివరకు పదహారు ఎన్‌కౌంటర్లు బూటకమేనని తేల్చి చేప్పింది. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలిని ఆదేశించింది. అయితే కమిషన్ తీర్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి