ఔస్సాహిక ఫోటోగ్రాఫర్లకు షార్ట్ ఫిలిం మేకర్లకు ఆహ్వానం.
ఎస్పీ రాహుల్ హెగ్డే.
సిరిసిల్ల. అక్టోబర్ 15 (జనం సాక్షి). రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు యువతకు షార్ట్ ఫిలిం మేకర్ల కు పోటీలకు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలు సమాజ పరిరక్షణలో ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం అక్టోబర్ 21 నాడు జరిగే పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీస్ రిలేటెడ్ అంశంపై ఫోటోగ్రఫీ మరియు షార్ట్ ఫిలిం తీయడానికి ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఫోటో గ్రాఫర్లు యువకులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. పోటీలలో గెలుపొందిన వారికి మెరిట్ సర్టిఫికెట్స్ తో పాటు మేమెంటో అందించడం జరుగుతుందని అన్నారు. అక్టోబర్ 24 సాయంత్రం లోగా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫోటోలను షార్ట్ ఫిలిం సిడి లేదా పెన్ డ్రైవ్ ద్వారా అందజేయాలని సూచించారు. ఎంపికైన మూడు షార్ట్ ఫిలింలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు ఎస్పి రాహుల్ హెగ్డే తెలిపారు.