కంతనపల్లి ప్రాజెక్టు పనులు పూర్తిచేయాలని రాస్తారోకో
మర్రిపెడ రూరల్: ఏటూరునాగారం సరిహద్దు ప్రాంతంలో కాంతనపల్లి ప్రాజెక్టు పనులు చేపట్టాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని వరంగల్, ఖమ్మం అంత రాష్ట్ర రహదారి పై రాస్తారోకో చేశారు. ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన చేపడితేనే సాగు, తాగునీరు అందుతాయని అఖిలపక్ష నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి అల్వాల వీరయ్య, బానాల రాజన్న, జిన్న లచ్చయ్య, నందిపాటి వెంకన్న పలువురు నాయకులు తెలిపారు.