కందిపంటకు నష్టం
రంగారెడ్డి,సెప్టెంబర్18(జనంసాక్షి): ఇటీవల పప్పుల ధరలు బాగా పెరగడంతో ఈ సారి పంటను పెద్ద మొత్తంలో సాగు చేశారు. ప్రధానంగా పత్తి, కంది, పంటలు దెబ్బతిన్నాయి. పెద్ద మొత్తంలో పత్తి పాడైనట్లు తెలుస్తోంది. అలాగే ఆలస్యంగా వేసిన మొక్కజొన్న పంటకు కూడా నష్టం వాటిల్లింది. వరుసగా కురుస్తున్న వర్షాలు అన్నదాతలకు నష్టాలను మిగిల్చాయి. ముఖ్యంగా కంది, పత్తి రైతులకు సమస్యలు తప్పేలా లేవు. కంది పంటలకు నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నీరు నిల్వ ఉన్న చేలల్లో నష్టం ఎక్కువగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి వికారాబాద్, మోమిన్‌పేట, బంట్వారం, ధారూరు, శంకర్‌పల్లి తదితర ఏడు మండలాల్లో పంటలకు అధిక నష్టం వాటిల్లింది.