కంభం ప్రభుత్వ వైద్యశాల వద్ద ధర్నా

మిస్టరీగా మారిన సలకలవీడు కేసు
పొలం యజమాని పరారి
అనుమానాస్పదంగా కేసు నమోదు
కంభం ్‌, జూలై 11: బేస్తవారిపేట మండలం సలకలవీడులోని పొలంలో గత 18 నెలలుగా వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న అర్ధవీడు మండలం నాగులవరం గ్రామానికి చెందిన చీకుర్తి వెంకటరంగయ్య (45) శనివారం రక్తపు మడుగులో పొలంలో శవంగా పడివుండటం పోలీసులు గుర్తించారు. పక్కనే రెండు బిందెలు, రోకలిబండ కూడా ఉందని బంధువులు తెలిపారు. కంభం మండలం రావిపాడు గ్రామంకు చెందిన మద్దుకూరి తిరుపాలు ఆ పొలం యజమాని కావడంతో మృతుని బంధువులకు పొలం యజమానిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతునికి భార్య, ఒక అమ్మాయి. ఒక అబ్బాయి ఉన్నారు. పొలం యజమాని పరారిలో ఉండటంతో అతనిపై కేసు నమోదు చేసి తదుపరి శవంకు పంచనామా చేయాలంటూ కంభం వైద్యశాల వద్ద మాల మహానాడు నాయకులు చింతల అరుణ్‌దేవ్‌ ఆధ్వర్యంలో మృతుని బంధువుల బైఠాయించారు. రెండు రోజుల క్రితమే మృతుడు చనిపోయివుండవచ్చని, పొట్ట ఉబ్బిఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే నిందితుడు ఎవరైనది ఇప్పుడే తేల్చలేమని ముందుగా శవాన్ని పంచనామా చేసి రిపోర్టు ఆధారంగా కేసు ముందుకు నడుస్తుందని ప్రస్తుతం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసినట్లు బేస్తవారిపేట ఎస్‌ఐ రమేష్‌బాబు తెలిపారు.