కడెం కాలువకు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
గత వారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరద నీటితో కడెం నారాయణ ప్రాజెక్ట్ నిండిపోవడంతో దిగువ వ్యవసాయ భూములకు నీరు అందించాలని ఆలోచనతో శనివారం మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు కడెం కుడి కాలువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంతో దిగువ ప్రాంతంలో ఉన్న రైతులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వర్షాకాలం పంటలకు నీరు కొదవలేదని దీనితో రైతులు పంటలు వేసుకోవాలని అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా తోడ్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు