కనుల పండగ నాగుల చవితి వేడుకలు.
రాయికల్ మండలం కొత్తపేట శ్రీ రాజరాజేశ్వర నాగాలయంలో నాగుల చవితి సందర్భంగా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేశారు ఉదయం నుండి ప్రసిద్ధ నాగలయం(పుట్ట)దగ్గర భక్తులు క్యు కట్టి నాగేశ్వర స్వామి దర్శించుకున్నారు.ఎంపీపీ లవుడ్య సంధ్యారాణి జడ్పిటిసి అశ్విని యాదవ్ నాగేశ్వరునిదర్శించుకుని పుట్టలో పాలు పోసి మొక్కలు చెల్లించుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీ రాజేశ్వర శర్మచైర్మన్ ధన కంటి ప్రవీణ్, ఆలయ ఇఓ విక్రం గౌడ్వైస్ ఎంపీపీ మహేశ్వర రావు, మాజీ ఎంపీపీ ఉత్కం రాధ సాయి గౌడ్ సర్పంచ్ లు బత్తిని రాజేశం, బెక్కం తిరుపతి, మన్నే గుండ్ల వెంకమ్మఎంపిటిసి మందుల శ్రీనివాస్,సురేందర్ నాయక్, రంజిత్, , తదితరులు పాల్గొన్నారు.