కన్నడ మాజీ సీఎంకు కీలక పదవి

– సంకీర్ణ ప్రభుత్వానికి సమన్వయ సమితి సభ్యుడుగా నియామకం?
– నేడోరేపో సీఎం కుమారస్వామి ప్రకటించే అవకాశం
– ఇప్పటికే కుమారస్వామి, పరమేశ్వర్‌ మధ్య చర్చలు
చెన్నై, జూన్‌25(జ‌నం సాక్షి ) : కర్ణాటక మాజీ  ముఖ్యమంత్రి  సిద్ధరామయ్యకు.. .కేబినెట్‌  ¬దాతో  ఓ పదవిని  కట్టబెట్టేందుకు కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం ప్లాన్‌ రెడీ చేస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య సంకీర్ణ  ప్రభుత్వ  సమన్వయ సమితి  అధ్యక్షుడుగా  ఉన్నారు. ఈ పదవిలో  ఈయన  సేవలన్నీ ప్రభుత్వానికి  బయట నుంచే  చేయాలి. ఈ పదవికి  అధికారికంగా  ప్రత్యేక ¬దా  ఉండదు. అయిదేళ్ల పాటు  ఏకధాటిగా  కాంగ్రెస్‌  ప్రభుత్వాన్ని  నడిపిన సిద్ధరామయ్యకు..  మరింత  ఉన్నతమైన  స్థానాన్ని  కట్టబెట్టేందుకు  సంకీర్ణ  ప్రభుత్వం పావులు  కదుపుతోంది. ప్రభుత్వమే సమన్వయ సమితిని  ఏర్పాటు చేసి దానికి కేబినెట్‌  ¬దాను  ఇవ్వనున్నట్టు  సమాచారం. దీనిపై  ముఖ్యమంత్రి  కుమారస్వామి, ఉపముఖ్యమంత్రి  పరమేశ్వర్‌ సుదీర్ఘంగా  చర్చిస్తున్నట్లు  తెలుస్తోంది. సమన్వయ  సమితిని  ప్రభుత్వమే  ఏర్పాటు చేసి.. దానికి  సిద్ధరామయ్యనే  అధ్యక్షుడ్ని చేస్తారు.  కేంద్రంలో యూపీఏ  అధికారంలో  ఉన్నపుడు  ప్రభుత్వాన్ని సమన్వయ  పరిచేందుకు  సోనియాగాంధీని  అధ్యక్షులుగా చేశారు. ఈపదవిలో  సోనియా అత్యంత కీలకపాత్ర  పోషించారు.  ఇదే తరహాలో  ప్రస్తుత కర్ణాటక  సంకీర్ణ  ప్రభుత్వానికి  సమన్వయ సమితి  అధ్యక్షులుగా సిద్ధరామయ్య  క్రియాశీలకంగా  వ్యవహరిస్తారు. విధాన సౌధలోనూ ఈ సమితి వ్యవహారాల కోసం ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు  చేస్తారు. కేబినెట్‌  ¬దాలోనే  సమన్వయ సమితి  అధ్యక్షుడు  ప్రభుత్వానికి  సలహాలు ఇస్తారని  చెప్తున్నారు. ఈ విషయంపై మంగళవారం నాటికి ఒ ప్రకటన వచ్చే అవకాశాలు లేకపోలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.