కన్నీళ్లు పెట్టుకున్న బెక్‌హామ్‌

పారిస్‌, మే 29 (జనంసాక్షి) :
పారిస్‌ అంతర్జాతీయ కెరీర్‌నుంచి రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ఇంగ్లాండ్‌ సాకర్‌ వీరుడు డేవిడ్‌ బెక్‌హామ్‌ పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ తరపున చివరి మ్యాచ్‌ ఆడాడు. లీగ్‌1చాంపియన్‌షిప్‌లో బాగంగా బ్రెస్ట్‌తో మ్యాచ్‌ ఆడిన తర్వాత మైదానమంతా తిరిగిన బెక్‌హామ్‌ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. భారీ సంఖ్యలో హాజరైర అభిమానులు మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు అతని పేరును జపించారు. మ్యాచ్‌ ముగిసిన వెంటనే గౌరవ సూచకంగా నిలబడి వీడ్కోలు చెప్పడంతో బెక్‌హామ్‌ కన్నీళ్లు పెట్టుకున్నాడు. 1994 తర్వాత మొదటిసారి ఈ జట్టు లీగ్‌1 చాంపియన్‌షిప్‌న కైవలం చేసుకోవడంలో బెక్‌హామ్‌ కీలక పాత్ర పోషించాడు. అతను మైదానంలో ఉన్నంత సేపు పారిస్‌ సెయింట్‌ అటగాళ్లు ఎంతో ఉత్సాహంతో చెలరేగిపోయారు. అనంతరం ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు.